Friday, April 19, 2024

లండ‌న్ లో విజ‌య్ మాల్యా ఇళ్లు జ‌ప్తు – నెక్ట్స్ ఏంటో

విజయ్ మాల్యా భార‌తీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయ‌లు అప్పు తీసుకుని విదేశాల‌కు చెక్కేశాడు ఈ వ్యాపార‌స్థుడు. లండ‌న్ లో త‌న సొంత ఇంట్లో ఉంటున్నాడు మాల్యా. కాగా మాల్యా ఇంటిని స్విస్ బ్యాంక్ జ‌ప్తు చేయ‌నుందట‌. అప్పులు చెల్లించ‌డంలో జాప్యం చేస్తుండ‌టంతో విజ‌య్ మాల్యాతో స‌హా ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని ఇంటి నుంచి బ‌హిష్క‌రించాల‌ని లండ‌న్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది పౌండ్ల లావిష్ గ్రేడ్-1 హోం 18-19 కార్న్ వాల్ టెర్రస్‌లో ఉండే మాల్యా.. రెండు ఇళ్లను ఒకే ఇంటికి మార్చి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. భారత్ నుంచి పారిపోయిన అనంతరం 34ఏళ్ల తన కొడుకు సిద్ధార్థ, 95సంవత్సరాల తల్లి లలితాతో కలిసి అక్కడే ఉంటున్నారు. అప్పులు చెల్లించకపోవడంతో స్విస్ బ్యాంకు కోర్టుకెక్కింది. అయితే.. ఈ కేసు విచారణలో కోర్టు పలు కీలక సూచనలు చేసింది.

నోటీసులు అందాక కుటుంబం స్వతహాగా ఖాళీ చేయనిప‌క్షంలో ఇంటి నుంచి పంపేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బ్యాంక్ ప్రొసీడింగ్స్ లో ఎటువంటి ఆలస్యం జరపాల్సిన అవసరం లేదని వెల్ల‌డించింది. లండన్ హైకోర్టు డిప్యూటీ మాస్టర్ రోస్ క్యాపిట్ పెట్టిన అప్లికేషన్‌ను, తీర్పు వాయిదా వేయాలన్న పిటిషన్ ను సైతం కొట్టేశారు. ఇప్పటికే సరిపడా సమయం ఇచ్చామని ఈ విషయంలో వేరే నిర్ణయం ఇస్తారని అనుకోవడం లేదన్నారు. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా.. నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నట్టే. దాదాపుగా ఆయన రోడ్డు మీద పడ్డట్టే. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్‌లోని విలాసవంతమైన బంగళా కూడా చేజారిపోయింది. ఆ బంగళాను స్విస్ బ్యాంక్ యూబీఎస్ స్వాధీనం చేసుకోనుంది. దీన్ని కాపాడుకోవడానికి విజయ్ మాల్యా ఇన్ని రోజులుగా చేస్తూ వస్తోన్న న్యాయపోరాటాలు వృధా అయ్యాయి. మ‌రి ఉంటున్న ఇంటిని జ‌ప్తు చేస్తే మాల్యా ఎక్క‌డికి వెళ్తాడో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement