Thursday, March 28, 2024

నేడు గవర్నర్లతో ప్రధాని కీలక సమావేశం.. కారణం అదే!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తన తడాఖా చూపిస్తోంది. రోజుకో రికార్డు త‌ర‌హాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… అన్ని రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. కరోనాపై సమీక్ష నిర్వహిస్తారు. దేశంలో కరోనా వచ్చాక ఇలాంటి మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. వర్చువల్ విధానంలో జరిగే ఈ మీటింగ్ ద్వారా ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించేలా చెయ్యమని గవర్నర్లను ప్రధాని మోదీ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. కరోనా నియమ నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశం కీలకం కాబోతోందని సమాచారం.

ఇటీవలే రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ మీటింగ్ పెట్టి… కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. రు. తాజాగా గవర్నర్ల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ మీటింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement