Friday, May 20, 2022

వేముల రాజ‌న్న‌న‌ని ద‌ర్శించుకున్న – ఎండీ వీసీ స‌జ్జ‌నార్

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ వేముల‌వాడ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు..ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు ఆల‌య అర్చ‌కులు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఎండీ స‌జ్జనార్ వెంట క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి, ఆల‌య ఈవో ర‌మాదేవి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఆల‌య సంద‌ర్శ‌న కంటే ముందు తిప్పాపూర్ బ‌స్టాండ్‌ను ప‌రిశీలించారు. ఇక ఆర్టీసీ, ఆల‌య అధికారుల‌తో స‌జ్జ‌నార్ స‌మావేశం కానున్నారు. రాజ‌న్న ప్ర‌సాదం కార్గో ద్వారా భ‌క్తుల‌కు అంద‌జేసే విష‌య‌మై చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement