Friday, April 26, 2024

Cheers to kohli: వామికా ఫ‌స్ట్ పిక్.. నెట్టింట వైర‌ల్‌గా మారిన ఫొటో..

ఇండియ‌న్ క్రికెట్ స్టార్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ ముద్దుల త‌న‌య వామిక ఫొటో తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చాలా రోజులుగా త‌మ‌ గారాల పాప‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చూపించ‌ని అనుష్క ఫ‌స్ట్ టైమ్ ఇవ్వాల జ‌నాల‌కు ముఖ ప‌రిచ‌యం చేసింది. ఈ ఫొటోను క్రిక్ ట్రాక‌ర్ ట్విట్ట‌ర్‌లో అప్ లోడ్ చేయ‌గా దాన్ని హాట్ స్టార్ డిస్నీ క్యాప్చ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇవ్వాల ఇండియా, సౌథాఫ్రికా మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్​ సెంచరీ చేసినప్పుడు తండ్రిని చూపిస్తూ చీర్​ చేస్తున్న అనుష్క ఫొటో ఇవ్వాల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే కొంత‌మంది ఆ ఫొటోని వెంట‌నే డిలీట్ చేయాల‌ని కోరుతుండ‌గా.. మ‌రికొంద‌రు పాప బాగుంది అని గ్రీటింగ్స్ చెబుతున్నారు..

https://twitter.com/Cricketracker/status/1485264656583507969
Advertisement

తాజా వార్తలు

Advertisement