Thursday, March 28, 2024

‘వాలిమై’ మేకింగ్ వీడియో : హాలీవుడ్ ని త‌ల‌పించేలా యాక్ష‌న్ సీన్స్

అజిత్ త‌మిళ‌నాట ఈ పేరు ఓ సంచ‌ల‌నం. అజిత్ చిత్రం గ‌త రెండేళ్ళుగా ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు. కాగా ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం వాలిమై. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి చాలా రోజుల‌యింది. ఈ చిత్రం అప్ డేట్ కోసం చూస్తోన్న వారికి గుడ్ న్యూస్ వ‌చ్చింది. వాలిమై మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్ర నిర్మాత బోనీ కపూర్ . కాగా దర్శకుడు హెచ్ వినోద్. అజిత్ రియల్ రేసర్ అనే విషయం తెల్సిందే. దాంతో బైక్ రేసింగ్ సన్నివేశాలు ఈ సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉండనున్నాయి అని మేకింగ్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలు.. హాలీవుడ్ చేజింగ్ సన్నివేశాల రేంజ్ లో వాలిమై లో అజిత్ యాక్షన్ అండ్ బైక్ చేజింగ్ సన్నివేశాలు చేసినట్లుగా ఈ వీడియోలో చూపించారు.

అద్బుతమైన యాక్షన్ తో పాటు మంచి డ్రామా కూడా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. మేకింగ్ వీడియోలో పూర్తిగా యాక్షన్ అండ్ చేజింగ్ సన్నివేశాలనే చూపించారు. ఒక చేజింగ్ సన్నివేశంలో అజిత్ కింద పడింది కూడా చూపించారు. గతంలో ఎన్నో సార్లు అజిత్ ప్ర‌మాదానికి గురయ్యాడు. కాని ఎప్పుడు కూడా ఆయన పట్టు వదల్లేదు. రెగ్యులర్ గా తన సినిమాల్లో యాక్షన్ డోస్ , ఛాలెంజింగ్ ఫీట్స్ డోసు పెంచుతూనే వచ్చాడు.తాజాగా ఈ సినిమా లో కూడా అంతకు మించి అన్నట్లుగా సాహసాలు చేశాడు. దెబ్బలు తగిలినా.. ఏం జరిగినా కూడా ఆహా అన్నట్లుగా ఆయన ఫీట్స్ కొనసాగాయని ఈ వీడియో తో తెలిసి పోతుంది. అజిత్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క తమిళ సినీ అభిమాని కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలిమై తెలుగు లో కూడా విడుదల అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాలిమై లో అజిత్ కు జోడీగా హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటించగా , తెలుగు యంగ్ హీరో కార్తికేయ విలన్ గా కనిపించబోతున్నాడు. వాలిమై లో అతడి లుక్ ను ఈ వీడియోలో రివీల్ చేశారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement