Friday, April 26, 2024

‘వాలి’కి సీక్వెల్ .. రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్న బోనీ క‌పూర్ ..

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టించిన చిత్రాల్లో హిట్ గా నిలిచిన చిత్రం వాలి కూడా ఒక‌టి. ఈ చిత్రంలో రెండు పాత్ర‌ల‌లో మెరిశాడు అజిత్…ఈ సినిమాతో ఎస్ .జె.సూర్య డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం అయ్యాడు. కాగా ఇన్నేళ్ల త‌ర్వాత వాలి మూవీకి సీక్వెల్ రానుంద‌ట‌. వాలి సినిమాకి సంబంధించిన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం రీమేక్ హ‌క్కుల‌ను బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత బోనీక‌పూర్ ద‌క్కించుకున్నాడు. అయితే క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌కి సంబంధించిన రీమేక్ హ‌క్కుల విష‌యంలో ప‌లు స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వాటిని స‌రిదిద్దే ప‌నిలో ఉన్నారు. నాటి వాలిలో అజిత్ కి జోడీగా సిమ్రాన్ న‌టించింది. మ‌రి నేటి వాలిలో ఎవ‌రెవ‌రు న‌టిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement