Saturday, April 20, 2024

వ్యాక్సిన్ వేయించుకుంటే ఖ‌రీదైన గిఫ్ట్స్ .. ఎక్క‌డో తెలుసా ..

క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో మ‌ళ్ళీ భ‌యాందోళ‌న‌లు పెరిగాయి. జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన స‌మ‌యం ఇది.. మాస్క్ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి..వీటితో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ లు తీసుకోవాల‌ని ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు తెలియ‌జేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం వినూత్న ప‌ద్ద‌తిలో వెళ్ళుతున్నారు గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు. వ్యాక్సిన్ వేయించుకుంటే బ‌హుమ‌తులు ఇస్తామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 7 మ‌ధ్య‌ వ్యాక్సిన్ తీసుకున్న వారందిరి లో ల‌క్కి డ్రా తీసి మొద‌టి బ‌హుమ‌తి గా రూ. 60 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా ఈ ల‌క్కీ డ్రా లో గెలిచిన 25 మందికి రూ. 10 వేల విలువైన బ‌హుమ‌తులు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే మురికి వాడల‌లో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకుంటే కిలో వంట నూనెను కూడా ఫ్రీ గా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. ఈ ప్ర‌క‌ట‌న తో అహ్మ‌దాబాద్ లో గ‌త రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ లు వేసుకోవ‌డానికి ప్ర‌జ‌లు పోటీ ప‌డుతున్నారు.. ఫ్రీగా ఇన్ని బ‌హుమ‌తులు వ‌స్తుంటే వ్యాక్సిన్ దేముంది.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. గిఫ్ట్ కి గిఫ్ట్స్ వ‌స్తుంటే జ‌నం ఆగుతారా. ఇప్పుడు అక్క‌డంతా వ్యాక్సిన్ బాట ప‌డుతున్నారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement