Thursday, April 25, 2024

టీకా కోసం దరఖాస్తు చేసుకున్న 1.33 కోట్ల మంది!

18 ఏళ్లు పై బడిన వారుకి మూడో దశ నుంచి వ్యాక్సినేషన్ మే 1 నుంచి ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ వయసు నిండిన భారతీయులందరు.. వ్యాక్సినేషన్ రిజిష్ట్రేషన్ ని వైబ్ సైట్ లో తమ పేరును నమోదు చేసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం ఈ ప్రక్రియ ప్రారంభమయింది. నిన్న సాయంత్రం 4 గంటల తరువాత వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, గంటల వ్యవధిలోనే 1.33 కోట్ల మంది రిజిస్టర్ చేయించుకున్నారు. వీరంతా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారే. వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాగానే నిమిషానికి 27 లక్షల హిట్స్ రావడంతో, వెబ్ సైట్ స్తంభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపై సమస్య పరిష్కారం అయిందని, రిజిస్టర్ చేయించుకున్న వారికి రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో స్లాట్ల అందుబాటును బట్టి, సమాచారం ఇచ్చి టీకాలు వేయిస్తామని తెలిపాయి. మరిన్ని అపాయింట్ మెంట్ స్లాట్లకు అవకాశం ఉందని, ఒకవేళ స్లాట్లు ఖాళీగా లేవని వెబ్ సైట్ లో కనిపిస్తే, కొంతకాలం తరువాత మరోసారి చెక్ చేసుకోవాలని, టీకా కావాలని భావించే వారు పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికతో ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement