Wednesday, March 27, 2024

మ‌రో ప‌విత్రా..న‌రేష్..భ‌ర్త‌ని..ల‌వ‌ర్ ని చెప్పుతో ఇర‌గ‌బాదిన భార్య‌-మంచి ప‌ని చేశావ్ అంటోన్న నెటిజ‌న్స్

ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చుగా వివాహేత‌ర సంబంధాలు..హ‌త్య‌లు వార్త‌ల్లో నిలుస్తున్నాయి. కాగా ఈ వీడియోలో కనిపిస్తున్న దంపతులు సుమారు 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరి సంతానం కూడా కలిగింది. అంతా సజావుగానే సాగుతున్నదని అనుకునే క్రమంలో ఆమె భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం బంధువుల ద్వారా ఆ భార్యకు తెలిసింది. తెలియగానే భర్తను నిలదీసింది. కానీ, దాటవేశాడు. ఆ తర్వాత కొన్ని ఆధారాలతో ప్రశ్నించింది. ఇక మీదట ఇవన్నీ మానుకోవాలని హెచ్చరించింది. కానీ వాటిని ఆ భర్త ఖాతరు చేయలేదు. అంతేకాదు, ఏకంగా తన లవర్‌ను ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. అనుకున్నట్టే లవర్‌ను ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఈ విషయం సదరు వ్యక్తి భార్యకు తెలిసింది. అంతే.. క్షణాల్లో ఆ హోటల్‌లో వాలిపోయింది. హోటల్ గదిలోకి ప్రవేశించి వెంటనే చెప్పు తీసి భర్తపై దాడి చేయడం ప్రారంభించింది. మధ్య మధ్యలో తన భర్తతో సంబంధం నెరపుతున్న వగలాడికీ నాలుగు అంటించింది. అంతటితో ఆగలేదు. తన భర్తపై ఆమెనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/newstracklive/status/1572154546474061825
Advertisement

తాజా వార్తలు

Advertisement