Thursday, April 25, 2024

నానో కారుని హెలికాప్ట‌ర్ గా మార్చిన కార్పెంట‌ర్.. చూసేందుకు ఎగ‌బ‌డుతోన్న జ‌నం

నానో కారుని హెలికాఫ్టర్ గా మార్చేశాడు ఓ కార్పెంటర్ . ఈ హెలికాప్టర్‌ రోడ్డుపై నడిచేదే అయినా.. కారులో ప్రయాణిస్తున్న వారికి విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ అజంగఢ్‌కు చెందిన సల్మాన్‌ కార్పెంటర్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే, తనకున్న నైపుణ్యంతో తన వద్ద ఉన్న నానో కారును హెలికాప్టర్‌గా మార్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీన్ని తయారు చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టినట్లు సల్మాన్‌ తెలిపాడు.

నేను రోడ్డుపై నడిచే హెలికాప్టర్‌ను తయారు చేశాను. దీని తయారీకి నాలుగు నెలల సమయం పట్టింది. దీని ధర రూ.3 లక్షలు. ప్రస్తుతం దీనికి చాలా డిమాండ్ ఉంది. నేను డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రోడ్డుపై వెళుతుంటే చాలా మంది గుమిగూడి దీన్ని వింతగా చూస్తున్నారు. పేరుకు నానో కారే అయినా.. హెలికాప్టర్‌గా డిజైన్‌ చేసిన తర్వాత గాల్లో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తోంద‌న్నాడు. తన ఆలోచనలను ఇలాగే ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా సల్మాన్ అన్నాడు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని తెలిపాడు. ప్రభుత్వం గానీ.. కంపెనీలు గానీ ముందుకొచ్చి తనకు సహాయం అందిస్తే నీరు, గాలితో నడిచే హెలికాప్టర్లను సైతం తయారుచేయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement