Tuesday, April 23, 2024

శాకుంత‌లం నుంచి అప్​డేట్​.. ఫస్ట్​ లుక్​ పోస్టర్​ రిలీజ్ రేపే..​

సమంతా న‌టించ‌నున్న ఎపిక్ లవ్ స్టోరీ అయిన‌ శాకుంతలం మూవీ నుంచి ఓ అప్ డేట్ వ‌చ్చింది.. జాను త‌ర్వాత‌ పుష్ప మూవీ స్పెష‌ల్ సాంగ్ లో అల‌రించిన‌ స‌మంతా.. ఇప్పుడు తాజాగా పౌరాణిక చిత్రం శాకుంత‌లం మూవీలో న‌టిస్తోంది. పాన్ ఇండియా రూపోందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా.. ఫిబ్ర‌వ‌రి 21న ఉద‌యం (రేపు) 9.30 కు దీని రిలీజ్ ఉంటుంద‌ని సినీ బృందం తెలిపింది..

పురాణాలు, పీరియాడికల్ డ్రామాలు.. అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అని స‌మంత గ‌తంలోనూ చెప్పింది.. అయితే ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో క్వీన్ శకుంతలా దేవిగా నటిస్తోంది సమంతా. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు, దిల్​రాజు, నీలం గుణ ప్రొడ్యూసర్​స్ గా ఉన్నారు. ఈ సినిమా దుష్యంతుడి పురాణ ప్రేమకథ ఆధారంగా రూపొందుతోంది. ఇది మహాభారతంలోని ‘ఆది పర్వానికి అనుసరణగా చెబుతున్నారు.. దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ భరత యువరాజుగా కనిపించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement