Thursday, April 18, 2024

ఇండియా టాక్ షోల‌లో ఫ‌స్ట్ ప్లేస్ లో ‘అన్ స్టాప‌బుల్’ – స‌ర్వే లో వెల్ల‌డించిన ‘ఐఎండీబీ’

వెండితెర న‌ట‌సింహం బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెర‌పై కూడా త‌న స‌త్తాని చాటుతున్నారు. ఓటీటీ వేదిక అయిన ఆహాలో అన్ స్టాప‌బుల్ అనే షోకి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బాల‌య్య షో ఎనిమిది ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. ఈ షో ఇప్పుడు ఇండియాలోనే ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇంట‌ర్నెట్ మూవీ డేటాబేస్ ఐఎండీబీ ఇండియా టాక్ షోల‌పై నిర్వ‌హించిన స‌ర్వేలో 9.7పాయింట్ల‌తో అన్ స్టాప‌బుల్ అగ్ర‌స్థానంలో నిలిచింది. కాగా రెండో స్థానంలో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ నిలిచింది. ఈ షోకు 7.8 పాయింట్లు దక్కాయి.

ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అన్ని టీవీ సిరీస్ లలో టాప్ 50 షోలను సెలెక్ట్ చేయగా… అందులో బాలయ్య షో అగ్ర స్థానంలో నిలిచింది.ఐఎంబీడీ సంస్థ సినిమాలు, టీవీ సిరీస్ లు, టాక్ షోలకు రేటింగ్ ఇస్తుంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న లెక్కల ద్వారా గ్రేడింగ్ ఇస్తుంది. అంతేకాదు, ప్రేక్షకుల రేటింగ్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విధంగా ఇచ్చిన రేటింగ్స్ లో బాలయ్య షో తొలి స్థానంలో నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement