Saturday, April 20, 2024

ర‌ష్మిక బ‌ర్త్ డే – కొత్త మూవీ నుండి పోస్ట‌ర్ రిలీజ్

నేడు హీరోయిన్ ర‌ష్మిక మంద‌న బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఆమె హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ చిత్రంలో న‌టిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నాడు. ర‌ష్మిక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ప్రేమ‌క‌థ‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌ష్మిక కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా అఫ్రిన్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తాజాగా విడుద‌లైన ఈమె లుక్ ఆక‌ట్టుకుంటుంది. దుల్క‌ర్ ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్‌ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మృనల్ థాకూర్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.ఇటీవ‌లే సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ‘యానిమ‌ల్’ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ లేటెస్ట్‌గానే ప్ర‌క‌ట‌న ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement