Sunday, March 24, 2024

Farm laws: 3 వ్యవసాయ చట్టాలు రద్దు.. బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

మూడు వ్యవసాయ చట్టాల బిల్లు రద్దు చేస్తూ కేంద్రం కేబినెట్ ఆమెందం తెలిపింది.  ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ  నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ‘ ద ఫామ్‌ లాస్‌ రిపీల్‌ బిల్‌ 2021 టు రిపీల్‌ త్రీ ఫామ్‌ లాస్‌’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్‌ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, పార్లమెంట్ తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 

ఇటీవల ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులు నిరసనను విరమించాలని కోరారు. ఈ క్రమంలో నేటి కేబినెట్ భేటీలో మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతున్నాయి. పార్లమెంట్లలో బిల్లు పాస్ అయ్యేదాకా నిరసనలను విరమించేది లేదని రైతులు ఇప్పటికే స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు వేచి ఉంటారని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement