Tuesday, April 16, 2024

హారీపోటర్​ మూవీలో ఉన్నటువంటి వింత జంతువు.. ఎక్కడ పుట్టిందంటే..

హ్యారీ పోటర్ సినిమాలు అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అంతా ఇష్టపడతారు. అందులో ఉండే వింత వింత జంతువులు అందరినీ అలరిస్తాయి. సేమ్​ ఆ సినిమాలో ఉండే జంతువు లాంటిదే అమెరికాలోని ఓ జూలో జన్మించింది. ఇప్పుడు దాన్ని చూడ్డానికి జనం ఎగబడుతున్నారు..

​గులాబీ రంగు, ముడతలు పడిన చర్మం, పెద్ద పరిమాణంలో ఉండి కిందికి వేలాడే చెవులు.. అమాయక కళ్లు,  చిన్న శరీరం… అచ్చం  హ్యారీ పోటర్ సిరీస్ అభిమానులకు ఈ వర్ణన కేవలం ఒక కేరక్టర్​కు సంబంధించి మాత్రమే.  ఇలాంటి క్యారెక్టర్​ అయిన హౌస్-ఎల్ఫ్ డాబీ అంటే చాలామంది లైక్​ చేస్తారు. అయితే ఇది ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ జూలో జన్మించిన మొదటి బేబీ ఆర్డ్ వార్క్ గా చెబుతున్నారు. 90 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి వింత జంతువును చూడలేదంటున్నారు జూ అధికారులు.  

ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఆర్డ్ వార్క్ జన్మించింది. కల్పిత పాత్రకు దాని అద్భుతమైన సారూప్యత కారణంగా ఈ జంతువుకు ఆ పేరు పెట్టారు. పుట్టిన సమయంలో డాబీ లింగం నిర్ధారించలేదు. కాగా, నిన్నటి శుక్రవారమే డోబీ అమ్మాయి అని చెస్టర్ జూ ట్విట్టర్‌లో ప్రకటించింది. బేబీ ఆర్డ్ వార్క్ ఫొటోని షేర్​ చేస్తూ చేసిన ట్వీట్‌లో “ఇది ఒక అమ్మాయి. మా కొత్త ఆర్డ్ వార్క్ దూడ డాబీ ఆడపిల్ల అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం”అని జూ అధికారులు వెల్లడించారు. డోబీని జూకీపర్లు ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. ఐదు వారాల పాటు దానికి ప్రతి రోజూ ప్రత్యేక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement