Tuesday, April 23, 2024

సెలబ్రిటీలను పట్టుకునేందుకేనా ఎన్ సీబీ ఉన్నది?

న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసులు రూ.150 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకుంటే.. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీ బీ) మాత్రం చిన్న మొత్తంలో పట్టుబడ్డ కేసుతో రచ్చ రచ్చ చేస్తోందన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. దసరా ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ఆర్యన్ ఖాన్ కేసు విషయాన్ని తొలిసారి ప్రస్తావించారు. ‘వాళ్లు సెలబ్రిటీలను పట్టుకోడానికే ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఏదో సందర్భంలో చిన్నచిన్న‌ కేసుల్లో ఫొటోలు తీయడం.. రచ్చ రచ్చ చేయడం అలవాటుగా మారింది’ అన్నారు. ముంబయి డ్రగ్స్ కేసు విషయంలో సీఎం ఉద్దవ్ తొలిసారి స్పందించారు. కావాలనే మహారాష్ట్ర ఉన్నతిని దెబ్బతీయాలని చూస్తున్నారని, చిన్నపాటి గంజాయి కేసుకు ఇంత గాయి గాయి చేయడం అవసరమా అన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్ లో ఏం జరుగుతోందో మీకు తెలియదా. అంతగా రేపులు జరుగుతుంటే అక్కడి పరిస్థితులను మాత్రం బాగున్నట్టు బిల్డప్ ఇస్తారు. అట్లాంటి దారుణాలపై కనీసం మాటైనా మాట్లడరు. కానీ, తమను టార్గెట్ చేసుకుని ఎందుకిట్ల చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు. బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వం పేరెత్త‌కుండానే కామెంట్స్ చేశారు ఉద్ద‌వ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement