Thursday, April 25, 2024

Missile Man | డీఆర్డీవో డైరెక్టర్​ జనరల్​గా రాజాబాబు నియామకం..

హైదరాబాద్ విశిష్ట శాస్త్రవేత్త, ఆర్‌సీఐ డైరెక్టర్ ఉమ్మలనేని రాజాబాబు మిస్సైల్స్​ అండ్​ స్ట్రాటెజిక్​ సిస్టమ్స్​ డైరెక్టర్​ జనరల్​గా నియమితుల​య్యారు. ప్రస్తుతం ఉన్న నారాయణమూర్తి పదవీ విరమణ అంటే.. ఈ జూన్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్టు డీఆర్​డీఓ తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​ డీఆర్​డీవో డైరెక్టర్​ జనరల్​గా నియమితులనై యు. రాజాబాబు రీసెర్చ్​ సెంటర్​ ఇమ్రాత్​ (RCI)లో ప్రోగ్రామ్ డైరెక్టర్, ADగా కూడా ఉన్నారు. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యాల రూపకల్పన, అభివృద్ధి, విజయవంతమైన ప్రదర్శనకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించారు. అతని లీడర్​షిప్​లో “మిషన్ శక్తి”, భారతదేశానికి చెందిన మొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష (A-SAT) విజయవంతంగా జరిగింది.

ఇక.. రాజాబాబు ఆంధ్రా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా ఉన్నారు. అతను IIT ఖరగ్‌పూర్ నుంచి మాస్టర్స్, JNTU నుంచి MBA పొందారు. 1988లో భారత వైమానిక దళంలో తన వృత్తిని ప్రారంభించారు. 1995లో DRDOలో చేరారు. తన 35 సంవత్సరాల ప్రొఫెషనల్ ఏరోస్పేస్ కెరీర్‌లో విమానం, హెలికాప్టర్లతో పాటు.. అనేక క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో ఆయన పనిచేశారు.

- Advertisement -

కాగా, RCI డైరెక్టర్‌గా రాజాబాబు అనేక క్లిష్టమైన సాంకేతికతలు, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అన్ని వ్యూహాత్మక Anti- Tank Guided Missile (ATGM) కోసం అధునాతన క్షిపణి ఏవియానిక్స్ అభివృద్ధి, సాయుధ దళాల కోసం వ్యూహాత్మక, క్రూయిజ్ క్షిపణులు.. ఆయుధ వ్యవస్థల అభివృద్ధి కోసం  పనిచేశారు. డిఫెన్స్ అప్లికేషన్స్ లో రాజాబాబు చేసిన కృషి.. సహకారం అతనికి అనేక గుర్తింపులను తెచ్చిపెట్టింది.

మిషన్ శక్తి ప్రదర్శనను విజయవంతంగా నడిపించినందుకు అతనికి రీసెర్చ్ & అత్యుత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డు లభించింది. ఇక తన ప్రతిభకు తగ్గట్టు ఎన్నో అవార్డులు అందుకున్నారు. అందులో స్వయం-విశ్వాసంలో నైపుణ్యానికి అగ్ని అవార్డు, DRDO సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ వంటి అవార్డులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement