Monday, December 9, 2024

Kerala : రెండు బస్సులు ఢీకొని.. 25మందికి గాయాలు

రెండు బస్సులు ఢీకొనడంతో 25మందికి గాయాలైన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరింజలకుడ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం త్రిసూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇరింజలకుడ పోలీసు స్టేషన్‌ అధికారి తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement