Saturday, November 27, 2021

జీత భ‌త్యాలు వ‌ద్ద‌న్న ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి.. థ్యాంక్స్ చెప్పిన ఎండీ స‌జ్జ‌నార్..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ సంస్థ నుంచి త‌న‌కు ఎలాంటి జీత‌భ‌త్యాలు వ‌ద్ద‌ని లిఖిత పూర్వ‌కంగా రాసి ఇచ్చారు. శాస‌న‌స‌భ స‌భ్యుడిగా త‌న‌కు వ‌స్తున్న జీత భ‌త్యాలు చాల‌ని ఆయ‌న తెలిపారు. టియ‌స్ ఆర్టీసీ ప్ర‌స్తుతం తీవ్ర న‌ష్టాల్లో ఉన్నందు వ‌ల్ల ఆర్థిక‌భారం మోప‌డం ఇష్టం లేక త‌న వంతుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బాజిరెడ్డి తెలిపారు.

అయితే..చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌ ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని త‌గ్గించ‌డానికి ఉదారంగా తీసుకున్న ఈ చారిత్రాత్మ‌క నిర్ణ‌యంపై సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వి.సి.స‌జ్జ‌నార్ థ్యాంక్స్ చెప్పారు. ఆర్టీసీ అధికారులు, సూప‌ర్వైజ‌ర్లు, ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News