Monday, April 15, 2024

గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులలోనూ ప్ర‌వీణ్ చేతివాటం…

హైద‌రాబాద్ – టీఎస్ పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అనేక కొత్త విష‌యాలు విచార‌ణ‌లో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.. పేప‌ర్ ల లీక్ లోనే కాకుండా పేప‌ర్ రీవాల్యూష‌న్ లోనూ ప్ర‌వీణ్ చేతివాటం చూపిన‌ట్లు వెల్ల‌డైంది.. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది… దీంతో అప్ప‌టి నియ‌మాకాల‌పై రివ్యూ చేయాల‌ని టిఎస్ ఎపిఎస్సి నిర్ణ‌యించింది.. ఇక ఈ కేసులోని 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలించారు. టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement