Saturday, October 12, 2024

TSPSC – హైటెక్ లీకు వీరులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సంచలనం సృష్టిం చిన టీ-ఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవ హారంలో రోజుకో సంచలన విష యాలువెలుగుచూస్తున్నా యి. నాంపల్లిలోని టీ-ఎస్‌పీఎస్‌సీ కార్యాలయం నుంచే కాకుండా వివిధ పరీక్షా కేంద్రాల నుంచి కూ డా పేపర్లు బయటకు పొక్కినట్టు- సిట్‌ విచారణలో బయటపడినట్టు- సమాచారం. లీకేజీలో కీలక సూత్రధారిగా విద్యుత్‌ శాఖ డీఈ రమేష్‌ ఉన్నట్టు- సిట్‌ నిర్ధారించింది. ఏఈఈ, డీఎంఓ పేపర్లు విక్రయించి పది కోట్ల రూపాయలను సంపాదించాలని టార్గెట్‌గా పెట్టు-కున్న రమేష్‌ హైదరాబాద్‌లోని లంగర్‌ హౌజ్‌ ప్రాంతానికి చెందిన ఓ పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆయన ద్వారా ప్రశ్న పత్రాలను తెప్పించినట్టు- సమాచారం. పరీక్ష ప్రారంభమైన ఐదు నిముషాల్లోనే రమేష్‌కు వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రం చేరేదని వెంటనే ఆయన సమాధానాలు సిద్ధం చేసి ఎంపిక చేసిన అభ్యర్థులకు బ్లూటూత్‌ ద్వారా చేరవేసేవారని తెలుస్తోంది. సమాధానాలు సిద్ధం చేసేందుకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, మలక్‌పేటలలో రమేష్‌ రెండు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు- చేసినట్టు- సిట్‌ గుర్తించింది. వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రం చేరవేసినందుకు ఇన్విజిలేటర్‌ తో రమేష్‌ ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించినట్టు- సమాచారం. ప్రస్తుతం సిట్‌ అదుపులో ఉన్న సదరు ఇన్విజిలేటర్‌ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించినట్టు- సమాచారం. ప్రశ్నపత్రాలకు సంబంధించి ఇన్విజిలేటర్‌తో పాటు- ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో సిట్‌ విచారణ జరుపుతున్నట్టు- తెలుస్తోంది.

ఏఈఈ, డీఏ పరీక్షల కోసం హై-టె-క్‌ మాస్‌ కాపీయింగ్‌కు రమేష్‌ తెరలేపారని, పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపో యేలా బఠాణి గింజంత స్పీకర్‌ అమర్చి వాటి ద్వారా సమాధానాలను చేరవేసి నట్టు- సిట్‌ గుర్తించింది. పరీక్ష అనంతరం చెవిలో నుండి దాన్ని బయటికి తీసేందుకు మ్యాగ్నటిక్‌ పరికరాన్ని విని యోగిం చినట్లు- నిర్ధారిం చారు. చొక్కా బనియన్‌లో చిన్నపాటి చిప్‌తో కూడిన డివైజ్‌ తో పాటు- మైక్రో ఫోన్‌ను రమేష్‌ అండ్‌ కో అమ ర్చినట్టు- సిట్‌ అనుమానిస్తోం ది. పరీక్షల్లో మాస్‌ కాపీయిం గ్‌ ఎలా చేయాలో శిక్షణ ఇ చ్చేందుకు రమేష్‌ మలక్‌ పేట లో ఒక కంట్రోల్‌ రూమ్‌ ఏ ర్పాటు-చేసినట్టు- సమాచారం.

రమేష్‌ అండ్‌ గ్యాంగ్‌ హై-టె-క్‌ కాపీయింగ్‌ గురించి ఇంట ర్నెట్‌లో శోధించారు. అందులో ఉన్న వివరాల ప్రకారం హై-టె-క్‌ కాపీయింగ్‌కు రమేష్‌ తెరలేపినట్టు- సిట్‌ గుర్తించి రమేష్‌ చరిత్రపై ఆరా తీసే పనిలో పడింది. కాగా ఇప్పటివరకు పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ 43 మందిని అరెస్టు చేసింది. పేపర్‌ లీకేజీ తో సంబంధం ఉన్న 50 మందిని కమిషన్‌ డిబార్‌ చేసింది.

బట్టబయలైన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వినియోగం
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వినియోగం బట్టబయలు కావడం సంచలనంగా మారింది. ఈ హై-టె-క్‌ వ్యవహారమంతా.. మలక్‌పేట్‌ కేంద్రంగా కొనసాగినట్లు- సిట్‌ అధికారులు గుర్తించారు. మలక్‌పేట్‌ నుంచి పరీక్ష హాల్‌లోని అభ్యర్థులకు మైక్రో వైర్‌లెస్‌ పరికరం ద్వారా రమేష్‌ బృందం సమాధానాలు చెప్పారు. రమేష్‌ ద్వారా ఒకరి నుంచి మరొకరికి మొత్తం 40 మందికి ఏఈ పేపర్‌ చేరింది. ఈ 40 మంది అభ్యర్థులను గుర్తించే పనిలో సిట్‌ బృందం పడింది. ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో డీఈ రమేష్‌ను ఆరు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్‌ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసింది.
పరీక్ష పేపర్ల లీకేజ్‌తో రూ.10 కోట్లు- సంపాదించాలని డీఈ రమేష్‌ స్కెచ్‌ వేసినట్లు- సిట్‌ గుర్తించింది. అలాగే.. ఇన్విజిలేటర్లకు డీఈ రమేష్‌ రూ.20 లక్షలు ఇచ్చినట్లు- తేల్చిన సిట్‌ అధికారులు.. ప్రస్తుతం వారిని విచారించే పనిలో నిమ గ్నమైంది. ఇక.. కొన్ని నెలలుగా విధులకు దూరంగా ఉంటు-న్న డీఈ రమేష్‌పై గతంలోనూ పలు రకాల కేసులు ఉన్నట్లు- తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పశ్నపత్రాల లీకేజీ కేసులో మరికొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement