Thursday, April 18, 2024

CM KCR: టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా చేసి ముందుకు..

దేశ పరిరక్షణ కోసం మనం కృషిచేయాల్సిన అవసరముందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ”దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారు.. భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నారు.. నేను వ్యతిరేకించాను”      అని అన్నారు. దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పానని తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయ వేదిక కాదు ప్రత్యేక ఎజెండా రావాలని సీఎం అన్నారు. నూతన వ్యవసాయ ఆర్థిక పారిశ్రామిక విధానం దేశంలో రావాల్సి వుందన్నారు.

టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి చేసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజల్లో చర్చ జరగాలన్నారు. దేశంలో జాతాపిత గాంధీనే దూషణలు చేస్తారా ? అంటూ మండిపడ్డారు. జాతిపితను దుర్భాష లాడడమా? నిందించండమా? ఎందుకు విద్వేషం ? అని ప్రశ్నించారు.  దేశంలో మత పిచ్చి లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న మత విద్వేషం మంచిదా ? నిలదీశారు. మారాల్సింది ప్రభత్వాలు కాదు మౌలిక వసతులు అని అన్నారు. బిజెపిని గద్దె దింపాలని కొన్ని పార్టీలు తనను కలసి కోరాయని వెల్లడించారు. ప్రజల ఎజెండాగా ఫ్రంట్ లు రావాలన్నారు. ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్న కేసీఆర్.. దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని అన్నారు. అందులో కేవలం 30 వేల టీఎంసీలలోపే వాడుకుంటున్నామని చెప్పారు. అయినా తాగునీరు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన వద్ద శక్తీసామర్థ్యాలు లేకనా ఈ పరిస్థితులు? అని ప్రశ్నించారు. మన వద్ద అన్నీ ఉన్నా. ఎందుకు ఈ పరిస్థితి నెలకొందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement