Wednesday, April 24, 2024

హుజురాబాద్ లో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల వీరే..

హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ, తమ పార్టీ అభ్యర్థి కోసం జోరుగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ సిద్ధం చేసింది. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి అందించింది.

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సుంకె రవి శంకర్, చల్లా ధర్మారెడ్డి, సతీశ్ కుమార్, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, ఇనుగుల పెద్దిరెడ్డి, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ విజయ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు ఉన్నారు.

కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. 

ఇది కూడా చదవండిః దేశంలో 90 కోట్లకు చేరువైన వ్యాక్సినేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement