Monday, January 30, 2023

పీయూష్ గోయ‌ల్ వెకిలి వేషాలు మానుకో: టీఆర్ఎస్ హెచ్చరిక

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ రైతు వ్య‌తిరేకి అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ అహంకార‌పూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచాడ‌ని రాష్ట్ర రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ రైతు వ్య‌తిరేకి అయితే 3 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం తెలంగాణ‌లో ఎందుకు పండింద‌ని ప్ర‌శ్నించారు. పీయూష్ గోయ‌ల్ చ‌రిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. న‌లుగురు బీజేపీ ఎంపీలు కేంద్రానికి త‌ప్పుడు స‌మాచారం ఇస్తూ తెలంగాణ‌కు ద్రోహం చేస్తున్నార‌ని ఆరోపించారు. పీయూష్ గోయ‌ల్ వెకిలి వేషాలు మానుకోవాల‌ని హెచ్చ‌రించారు. బీజేపీ నేత‌లు ధాన్యం కొనుగోలుపై ద్వంద్వ ప్ర‌మాణాలు పాటిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఉత్త‌ర భార‌త‌దేశానికో నీతి, ద‌క్షిణ భార‌త‌దేశానికో నీతి అన్న‌ట్టు కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement