Saturday, April 20, 2024

మంత్రిపై హత్యకు కుట్ర: నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ దోషులే

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కుట్రలోని పాత్ర దారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటని సూటిగా నిలిదీశారు. కిడ్నాప్‌ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసు అని ప్రశ్నించారు.  నిందితులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని అని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించదన్నారు. దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని పేర్కొన్నారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ కూడా దోషులే అని తెలిపారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సీపీని కోరుతామన్నారు.  తెలంగాణలో ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు నడువవని ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement