Wednesday, May 25, 2022

గుజరాత్ లో గుక్కెడు నీళ్ల కోసం తంటాలు.. ఇదీ డబుల్ ఇంజన్ పాలన

దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తన ట్విట్టర్లో ఓ ఫోటోని షేర్ చేశారు. అహ్మదాబాద్​లో ప్రజలు మంచి నీళ్లు దొరక్క అలమటిస్తున్నారని, ఇది డబుల్ ఇంజన్ పాలన కాదని
ట్రబుల్ ఇంజన్ పాలన అని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. కాగా, ఇప్పుడీ ట్వీట్​ పెద్ద ఎత్తున సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. గుజరాత్​ పాలన తీరు, బీజేపీ ప్రభుత్వంపై చాలామంది కామెంట్స్​, ట్రోలింగ్​ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement