Wednesday, January 19, 2022

Trisha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా

టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ నటుడు సత్యరాజ్, సంగీత దర్శకుడు థమన్ తదితరులు కోవడ్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ త్రిషకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాను కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ న్యూ ఇయర్‌‌కు ముందు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని త్రిష పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్నాయనీ తెలిపారు. అయితే కోవిడ్‌ ప్రభావం నుంచి తాను కోలుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు గత వారం రోజులుగా తాను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లు త్రిష చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని వెల్లడించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, అలాగే మాస్క్‌లు తప్పకుండా ఉపయోగించాలని సూచించింది. తాను మళ్లీ కోవిడ్ టెస్ట్  చేయించుకున్నానని త్రిష తెలిపింది. కోవిడ్ నెగెటివ్‌గా తేలితే వెంటనే ఇంటికి వెళ్లిపోతానని పేర్కొంది. తాను కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ త్రిష ట్వీట్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News