Monday, December 9, 2024

Breaking: తెలంగాణలో డీఎస్పీల బదిలీ.. ఆర్డర్స్​ ఇచ్చిన డీజీపీ మహేందర్​రెడ్డి

కరీంనగర్ రూరల్ ఏసీపీ గా కరుణాకర్ రావు

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండంసిసిఎస్ లో పనిచేస్తున్న టీ. కరుణాకర్ రావు ను కరీంనగర్ రూరల్ ఎసిపి గా, రూరల్ ఏసీపీ గా పనిచేస్తున్న విజయసారధి చీఫ్ ఆఫీస్ కు, సంగారెడ్డి డిసిఆర్బి లో పనిచేస్తున్న శ్రీనివాస్ నాయుడు ను శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపి గా, ట్రాఫిక్ ఏసీపీ గా పనిచేస్తున్న విశ్వప్రసాద్ ను చీఫ్ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న నరసింగ రావును పంజాగుట్ట ఏసీపీ గా, పంజాగుట్ట ఏసీపీ గా పనిచేస్తున్న గణేష్ ను చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని, ఏ సి బి లో పనిచేస్తున్న రమణమూర్తి ని ఇల్లందు డిఎస్పి గా, కామారెడ్డి డి సి ఆర్ వి లో పనిచేస్తున్న నాగభూషణం ను సూర్యాపేట డీఎస్పీగా, సూర్యాపేట డిఎస్పీ గా పనిచేస్తున్న మోహన్ కుమార్ ను చీఫ్ ఆఫీస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

..

Advertisement

తాజా వార్తలు

Advertisement