Friday, April 19, 2024

Breaking: 22 మంది ఇన్స్‌పెక్టర్ల బదిలీ.. ఉత్త‌ర్వులిచ్చిన అడిష‌న‌ల్ డీజీ నాగిరెడ్డి

మల్టి జోన్‌-1 పరిధిలో పని చేస్తున్న 22 మంది ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ అడిషనల్‌ డీజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సీఎస్‌బీలో పనిచేస్తున్న సీహెచ్‌. విద్యాసాగర్‌ను చెన్నూరు (కోటపల్లి సీఐగా), కోటపల్లి సీఐగా పని చేస్తున్న నాగరాజును కాగజ్‌నగర్‌ రూరల్‌కు బదిలీ చేశారు. కొత్తగూడెం ఎస్‌పీ అటాచ్డ్‌గా ఉన్నముస్కు అబ్బయ్యను కొత్తగూడెం మూడో ఠాణాకు, కొత్త గూడెం మూడో ఠాణాలో పని చేస్తున్న వేణుచందర్‌ను కొత్తగూడెం డీసీఆర్‌బీకి, తొర్రూర్‌లో పని చేస్తున్న కరుణాకర్‌ ను మంచిర్యాల సైబర్‌ క్రైమ్‌కు, కరీంనగర్‌లో అటాచ్డ్‌గా ఉన్న కే. జితేందర్‌ను ఆసిఫాబాద్‌ సీసీఎస్‌కు, రెబ్బన సీఐగా పని చేస్తున్న సతీష్‌కుమార్‌ను మంచిర్యాల పీసీఆర్‌కు, రామగుండం టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న మహేందర్‌ను నిర్మల్‌ డీసీఆర్‌బీకి, మంచిర్యాల పీసీఎస్‌లో పనపి చేస్తున్న అల్లం నరేందర్‌ను రెబ్బనకు, మంచిర్యాల సైబర్‌ క్రైమ్‌లో పని చేస్తున్న యాంబాడి సత్యనారాయణను తొ ర్రూరుకు బ‌దిలీ చేశారు.

ఇక‌.. పెద్దపల్లి సైబర్‌ క్రైమ్‌లో పని చేస్తున్న బద్దని శ్రీనివాస్‌ను వాంకిడికి, ఆసిఫాబాద్‌లో పని చేస్తున్న ఆకుల అశోక్‌ను రామగుండం టాస్క్‌ఫోర్స్‌కు, వాంకిడి సీఐగా పని చేస్తున్న సుధాకర్‌ను ఆసిఫాబాద్‌ సీసీఎస్‌కు, ఆసిఫాబాద్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న రాణాప్రతాప్‌ను ఆసిఫాబాద్‌కు, వరంగల్‌లో పని చేస్తున్న బాలాజీ వరప్రసాద్‌ను ఆదిలాబాద్‌ వీఆర్‌కు, నిర్మల్‌ డీసీఆర్‌బీలో పని చేస్తున్న శ్రీనివాస్‌ను కామారెడ్డి రూరల్‌కు, వరంగల్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్న హనుమాన్‌ను ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌కు, కొత్తగూడెం వీఆర్‌లో ఉన్న పుల్లయ్యను కరీంనగర్‌ వీఆర్‌కు, కాగజ్‌నగర్‌ రూరల్‌లో పని చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ను రామగుండం సైబర్‌ క్రైమ్‌కు, కొత్తగూడెం డీసీఆర్‌బీలో పని చేస్తున్న బాలకిషన్‌ను అశ్వరావుపేటకు, అశ్వరావుపేటలో పని చేస్తున్న ఉపేందర్‌రావును కొత్తగూడెం వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement