Saturday, May 28, 2022

పండుగ పూట విషాదం.. ఇటుక‌ల ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ఒక‌రు మృతి

నర్సింహులపేట, (ప్రభన్యూస్) సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన మహబూబుబాద్ జిల్లాలో జరిగింది. నర్సింహులపేట మండల కేంద్రంలోని జయపురం మూలమలుపు వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుడూరు మండలం గుండంరాజుపెల్లి గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిది ట్రాక్టర్ నర్సింహులపేట మండల కేంద్రం నుంచి ఇటుకలు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడింది. అందులో ఉన్న కార్మికుడు దుబ్బు వెంకన్న (50) అక్కడికక్కడే చనిపోయాడు. మెడ రవి (30) పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై లావూడ్యా నరేష్ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement