Thursday, April 25, 2024

ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కిలోమీట‌రున్న‌ర ఈడ్చుకెళ్లిన కారు

వేగంగా దూసుకొస్తూ సిగ్న‌ల్ జంప్ చేసిన కారుని ఆపారు కానిస్టేబుల్ సోమ‌నాథ్ చౌద‌రి. ఆయ‌న వివ‌రాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని ఢీకొట్టిన డ్రైవర్ కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో ఆయన ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ పట్టించుకోని నిందితుడు ఆయనను అలాగే కిలోమీటరున్నర దూరం పాటు ఈడ్చుకెళ్లాడు. అలా వెళ్తూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశామని, అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేయడం, హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయిందన్నారు. ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని వాసాయి శివారు ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement