Friday, May 27, 2022

Drug Case: రవితేజ ఆర్ధిక లావాదేవీలపై ఈడీ కూపీ!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణ ముగిసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో రవితేజను దాదాపు 6 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. రవితేజతోపాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా విచారించారు. కేసులో నిందితుడు కెల్విన్ స్నేహితుడు జీషన్ ను సైతం ఈడీ ప్రశ్నించింది. జీషన్ అలీఖాన్ తో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. రవితేజ, జీషన్ మధ్య ప్రత్యక్ష లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. లావాదేవీలపై రవితేజ, జీషన్ ను ప్రశ్నించారు. జీషన్ జరిపిన లావాదేవీలపై సమాధానాలను రవితేజ దాటవేసినట్లు సమాచారం.

కాగా, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే టాలీవుడ్ ప్రముఖులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిన్న హీరో రానాను ఈడీ అధికారులు విచారించారు. అంతకు ముందు డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరోయిన్స్ ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్ హాజరైయ్యారు. ఈ కేసులో సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవదీప్‌తో పాటు ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ 13న, ముమైత్‌ఖాన్‌ 15న, తనీష్‌ 17న, తరుణ్‌ 22న విచారణకు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: లబ్ధిదారుల ఖాతాలో దళితబంధు నిధులు.. చెక్ చేసుకోండి!

Advertisement

తాజా వార్తలు

Advertisement