Saturday, April 20, 2024

టాలీవుడ్ హీరో కృష్ణుడు అరెస్ట్

టాలీవుడ్ నటుడు కృష్ణుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట కేసులో ఆయన అరెస్టు చేసినట్లుగా సమాచారం. హైదరాబాద్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని శిల్పాపార్క్ విల్లా లో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు హీరో కృష్ణుడుని అరెస్ట్ చేశారు. కృష్ణుడుతో పాటుగా మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, 8 సెల్ ఫొన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం వీరిని అరెస్టు చేశారు. మియాపూర్లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కలిసి కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. వారందరినీ మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టారు. ఈ రోజు సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు.

కాగా, వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించి నటుడిగా కృష్ణుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement