Wednesday, April 24, 2024

విష‌మంగా కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యం ..జూబ్లీహిల్స్ అపోలలో చికిత్స‌..

గ‌త కొంత‌కాలంగా సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేదు. దాంతో సినిమాల‌కు దూరంగా ఉంటున్నారాయ‌న‌. గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ప్రమాదవశాత్తు ఇంట్లో కాలు జారిపడగా… సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మ‌చారం. ప్రస్తుతం ఆయనను జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. ప్రేక్ష‌కులు కూడా ఆందోళ‌న ప‌డుతున్నారు. కైకాల సత్యనారాయణ న‌టప్రస్థానం ఎందరో న‌టుల‌కు ఆద‌ర్శ‌ప్రాయం. ఆయన ఆరోగ్యం బాగాలేని రోజుల్లో సినిమాల మీద మ‌క్కువ‌తో చిన్న పాత్రలతో అయినా న‌టించేవారు. ఆయ‌న సీనియర్ ఎన్‌టీఆర్‌కు ఎన్నో సినిమాలకు డూప్‌గా నటించారు. యముడి పాత్రకు ఆయ‌న‌కు విపరీతమైన క్రేజ్ లభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement