Wednesday, April 17, 2024

Tokyo Paralympics: ఇండియన్ అథ్లెట్ల జోరు.. భారత్ కు 15 పతకాలు

టోక్యో పారాలింపిక్స్​లో ఇండియన్ అథ్లెట్లు దూసుకుపోతున్నారు. తాజాగా పురుషుల మిక్స్​డ్ 50మీ పిస్టోల్ ఎస్​హెచ్​1 షూటింగ్​ ఈవెంట్​లో రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. మనీష్ నర్వాల్​కు బంగారు పతకం రాగా, సింగ్​రాజ్ అధానా రజతంతో మెరిశాడు. ఇప్పటికే పురుషుల 10మీ ఎయిర్​ పిస్టోల్ విభాగంలో కాంస్యం దక్కించుకున్నాడు సింగ్​రాజ్. ఈ మెగాటోర్నీలో ఇతడికి ఇది రెండో పతకం. మొత్తంగా ఈ రెండు పతకాలతో టోక్యో పారాలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య 15కు చేరింది. 

కాగా నిన్నమహిళల షూటింగ్​ ఆర్​8 షూట‌ర్ అవ‌ని లెఖారా మ‌రోసారి చ‌రిత్ర సృష్టించింది. 50మీ. రైఫిల్​ 3పీ విభాగంలో.. అవని లేఖరా కాంస్యం సాధించింది. 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచి ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. దీంతో పారాలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారణిగా రికార్డుకెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement