Tuesday, April 16, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాంద‌.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.55 వేల 300 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 60 వేల 330 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం రూ.55 వేల 450 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఢిల్లీలో ఇవాళ 10 గ్రాములకు రూ. 60 వేల 480 వద్ద ట్రేడవుతోంది.వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తోంది. రెండ్రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 73 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో మాత్రం కిలో వెండి రేటు రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు హైదరాబాద్‌లో రూ. 77 వేల 700 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంటుంది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. క్రితం రోజు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర లు కాస్త దిగివచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో డాలర్ పుంజుకుంటోంది. దీంతో బంగారం రేటుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1961 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.56 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత కరెన్సీ రూపాయి విలువ రూ. 82. 530 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement