Monday, May 29, 2023

స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ప్రస్తుతం రూ.54 వేల 700 మార్క్ వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ. 59 వేల 670 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం రేటు క్రితం సెషన్‌తో పోలిస్తే స్థిరంగా ఉంది. ప్రస్తుతం రూ.54 వేల 850 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములకు రూ.59 వేల 820 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే ఇటీవల కాస్త ఉపశమనం ఇచ్చిన ధర ఇవాళ ఒక్కసారే కిలోకు రూ.500 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.76 వేల 200 పలుకుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీ విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం హస్తినాలో కిలో వెండి ధరరూ.73 వేల 300 వద్ద ఉంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా, సిల్వర్ రేటు కాస్త ఎక్కువగానూ ఉంటుంది. దానికి ఆయా ప్రాంతాల్లో విధిస్తున్న ట్యాక్సులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఎప్పుడు తగ్గుతాయా అని పసిడి ప్రియులు వేచి చూస్తున్నారు. డాలర్ పుంజుకుంటుండడంతో ధరలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement