Saturday, December 7, 2024

తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం విషయానికి వస్తే అక్టోబర్ 31న తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.150 తగ్గి.. 46 వేల 600 రూపాయలకు పడిపోయింది. అంతకుముందు రోజు ఈ రేటు రూ. 46 వేల 750 వద్ద ఉండేది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.160 పడిపోయి రూ.51 వేల నుంచి 50 వేల 840 రూపాయలకు పతనమైంది. వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల నుంచి ఇలాగే ఏ మార్పూ లేకుండా ఉన్నాయి. కేజీ సిల్వర్ ధర హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.63 వేల వద్ద ఉంది. 15 రోజుల క్రితం మాత్రం వరుసగా తగ్గి.. ఏకంగా 6500 మేర ధరలు పడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement