Friday, April 26, 2024

పెరిగిన బంగారం.. త‌గ్గిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.820 మేర పెరిగి రూ.53 వేల 180కి చేరింది. ఇది కూడా అంతే. గరిష్ట విలువల వద్ద కొనసాగుతోంది. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన రేట్లు ఇవ్వాళ తగ్గుముఖం పట్టింది. ఏకంగా రూ.1300 మేర పతనమైంది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1300 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.67 వేల 200కు చేరింది. ముందురోజు ఈ ధర రూ.68 వేల 500 వద్ద ఉండటం గమనార్హం. అంతకుముందు 5 రోజుల్లోనే ఏకంగా రూ. 2600 మేర సిల్వర్ రేటు పెరగడం గమనార్హం. దిల్లీ మార్కెట్లో వెండి ధరలు కాస్త తక్కువలోనే ఉంటాయి.

ప్రస్తుతం అక్కడ కిలో సిల్వర్ రూ.62 వేలు మాత్రమే ఉంది. ఇక 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.48 వేల 900 వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికాలో యూఎస్ ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని స్పష్టత లేదు. అక్కడ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో కాస్త తగ్గినా వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదించేది లేదని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. దీంతో రానున్న రోజుల్లో మాత్రం బంగారం రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటికే రేట్లు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1764 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 21 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement