Thursday, April 25, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..ఢిల్లీ, హైదరాబాద్ సహా అంతర్జాతీయంగా పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. బంగారం ధర తాజాగా హోలీ రోజైన మార్చి 8న హైదరాబాద్‌లో ఏకంగా 10 గ్రాములకు రూ.650 పడిపోయింది. ఇది 22 క్యారెట్స్ గోల్డ్. దీంతో ఇప్పుడు రూ.51 వేల మార్కుకు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ.200 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.720 పడిపోయి.. రూ.55,630 మార్కును తాకింది.హైదరాబాద్‌తో పాటే దిల్లీలో కూడా బంగారం ధర భారీగానే తగ్గింది.

అక్కడ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రామ్ గోల్డ్ రూ.650 తగ్గి.. ప్రస్తుతం రూ.51,150 మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.720 మేర పడిపోయి ఇక రూ.55,780 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక సాధారణంగా గోల్డ్ రేటు హైదరాబాద్ కంటే దిల్లీలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది.బంగారంతో పోలిస్తే వెండి మరింత భారీగా తగ్గడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో సిల్వర్ రేటు కిలోకు ఒక్కరోజే రూ.2500 తగ్గింది. దీంతో ఇప్పుడు రూ.67,500కు చేరింది. చాలా రోజుల తర్వాత ఈ స్థాయికి తగ్గడం గమనార్హం. కొద్దిరోజుల కిందటి వరకు ఇది ఏకంగా రూ.77 మార్కు పైన ట్రేడవడం తెలిసిందే. ఫిబ్రవరి 8న కిలో వెండి హైదరాబాద్‌లో రూ.77,800 వద్ద ఉండేది. దీంతో దాదాపు రూ.10 వేలకుపైనే తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement