Thursday, March 28, 2024

పెరిగిన బంగారం ధరలు.. పసిడి బాటలోనే వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో కేవలం రూ.10 మాత్రమే పెరిగి రూ.47,810కు చేరుకుంది. కానీ ఈ వారంలో మాత్రం బంగారం ధర బాగానే పెరిగింది. వారం ప్రారంభంలో రూ.46,900గా ఉన్న ధర రూ.47,810కు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా నేడు స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. ఈ రేటు కేవలం రూ.10 మాత్రమే పెరగడంతో.. ఇది రూ.52,160కు చేరుకుంది. 24 క్యారెట్ల ధర కూడా వారం ప్రారంభంలో రూ.51,160గా ఉంటే.. ప్రస్తుతం రూ.52,160కి పెరిగింది. ఈ ధర అయితే వారంలో ఏకంగా వెయ్యి రూపాయల మేర పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.10 పెరిగి రూ.48,010కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,370కి ఎగిసింది. విజయవాడలో బంగారం ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,810కి, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,160కి ఎగిసింది. హైదరాబాద్‌, విజయవాడల్లో సిల్వర్ రేట్లు సైతం పెరుగుదలను నమోదు చేశాయి. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో.. ఈ రేటు రూ.67,800కి చేరుకుంది. అయితే ఢిల్లీ మార్కెట్లో మాత్రం సిల్వర్ ధర రూ.200 తగ్గి రూ.61,700కి దిగొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement