Friday, April 26, 2024

తగ్గుతోన్న బంగారం ధరలు.. పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. మన బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి.. 48 వేల 350 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 170 పడిపోయి 52 వేల 750 రూపాయలకు చేరింది. ఒకవైపు బంగారం ధరలు పడిపోతుంటే.. మరోవైపు సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెెండి ధర రూ.500 మేర పెరిగి కిలోకు రూ.67 వేలకు చేరింది. అంతకుముందు రోజు కిలో వెండి రూ.1000 మేర తగ్గింది. 15 రోజుల క్రితం మాత్రం వెండి రేట్లు కిలోకు రూ.63 వేల లెవెల్స్‌కు కూడా చేరాయి. ఇక అప్పటినుంచి ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ఇవి తగ్గుతాయేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement