Tuesday, March 26, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 మేర తగ్గింది. దీంతో రూ.48 వేల 600 నుంచి గోల్డ్ రేటు 48 వేల 500కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా హైదరాబాద్‌లో రూ.100 తగ్గి.. ప్రస్తుతం 52 వేల 920 రూపాయలు పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ రేట్లు హైదరాబాద్‌లో ఉన్నట్లే ఉన్నాయి. సిల్వర్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గింది. దీంతో ప్రస్తుతం ధర రూ.66 వేల 500 వద్ద ఉంది. కొద్దిరోజులుగా వెండి ధర రూ.65 వేల పైనే కొనసాగుతోంది. దిల్లీలో మాత్రం వెండి రేటు చాలా తక్కువగా ఉంటుంది. రూ.400 తగ్గి ప్రస్తుతం దేశ రాజధానిలో కిలో వెండి రూ.60 వేల 600 వద్ద ఉంది. బంగారం, వెండి రేట్లు అన్ని చోట్లా ఒకే రేటులో ఉండవు. అవి అక్కడి పరిస్థితులు, స్థానిక పన్నులను బట్టి మారుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement