Wednesday, April 17, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 దిగివచ్చింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 300 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ రూ.770 తగ్గి రూ.60 వేల 330 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.700 పడిపోయి రూ.55 వేల 450 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.770 తగ్గింది. ప్రస్తుతం రూ.60 వేల 480 వద్ద ట్రేడవుతోంది.

వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తూ ఇవాళ భారీగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.800 తగ్గింది. ప్రస్తుతం కిలో రూ.77 వేల 800 పలుకుతోంది. మరోవైపు.. ఢిల్లీ మార్కెట్లో చూసినట్లయితే ఇవాళ కిలో వెండి రేటు రూ.400 దిగివచ్చి ప్రస్తుతం రూ. 73 వేలు వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్, ఢిల్లీ మధ్య ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా.. వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సెస్, కమీషన్స్ వంటివి కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement