Saturday, April 20, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర తులానికి రూ.220 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 57,380కి చేరింది. అంతకు ముందు రోజు మాత్రం రూ.500 మేర తగ్గడం గమనార్హం. ఇక దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం రూ.52,750కి చేరింది.

మరోవైపు.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 20 గ్రాములకు రూ.220 పెరిగింది. ప్రస్తుతం రూ.57,530 వద్దకు చేరింది. వెండి విషయానికి వస్తే ఈ మెటల్ ధర కూడూ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో వెండి కిలోకు రూ.70 వేల 500 వద్ద కొనసాగుతోంది. అంతకు ముందు రోజు రూ. 550 మేర దిగివచ్చింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.72 వేల 700 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో రూ.1500 తగ్గిన వెండి ఇవాళ రూ.200 మేర పెరిగింది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు తక్కువగా, వెండి రేట్లు ఎక్కువగా ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నుల ఆధారంగా ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement