Saturday, April 20, 2024

అమానవీయం: కరోనా మృతుల పట్ల ప్రైవేట్ ఆస్పత్రి తీరు!

దేశంలో కరోనా వైరస్ రెండో సారి వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తున్నది. కొత్త కేసులు మూడు లక్షలకు చేరువకాగా, ప్రతిరోజూ దాదాపు రెండు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్నది. కొత్త కేసులు, మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ఆసుపత్రుల్లో కరోనా మృతదేహాలు పేరుకుపోతున్నాయి. తగినన్ని ఫ్రీజర్లు లేకపోవడంతో మార్చురీలలో గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పడి ఉంటున్నాయి. అయితే, కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.  కరోనా బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించడం దగ్గర నుండి ఒకవేళ వారు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకువెళ్లడం వరకు అడుగడుగునా కొనసాగుతున్న ఆర్ధిక దోపిడీ ఇంకోవైపు ప్రజలను ఇబ్బంది పెడుతుంది.

తెలంగాణలో కరోనతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రిలో ఉంచేందుకు నిరాకరించింది యాజమాన్యం. కనీసం ఆసుపత్రిలోని మార్చురీలో ఫ్రీజర్‌ లో పెట్టేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. దీంతో వారు ఓ అంబులెన్స్ లో ఫ్రీజర్ ఏర్పాటు చేసి అందులో వ్యక్తి మృతదేహాన్ని ఉంచారు. అనంతరం అంత్యక్రయులకు ఏర్పాటు చేశారు. అయితే, కేవలం ఒక్క రాత్రి అంబులెన్స్ రూ.32 వేల వసూలు చేశారు.  ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వహకుడు. కోవిడ్ మృతులపై ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహారిస్తున్న తీరును ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం, గవర్నర్, మంత్రుల కేటీఆర్, ఈటల రాజేందర్, సీఎస్ సోమష్‌ కుమార్ లకు ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement