Saturday, December 7, 2024

కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాన్ని ప‌రిశీలించిన టీటీడీ ఛైర్మ‌న్ .. మీ కోసం ఈ వీడియో ..

ఈ ఏడాది కురిసిన భారీ వ‌ర్షాలు ప‌లు ప్రాంతాల్లో నానా బీభ‌త్సాన్ని సృష్టించాయి.. కాగా శ్రీవారి మెట్టు మార్గంపై భారీగా వ‌ర‌ద‌నీరు ప్ర‌వ‌హించ‌డ‌మే కాదు ..రెండో రోడ్డులో కొండ చ‌రియ‌లు భారీగా విరిగా ప‌డ‌టంతో ర‌హ‌దారి బాగా దెబ్బ‌తింది. ర‌హ‌దారిలోని ఒక వైపు భాగమంతా లోయలోకి జారిపోయింది. ఏదైనా వాహనాలు వచ్చే సమయంలో ఆ కొండచరియలు విరిగిపడుంటే పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగేది. ఇది ఇలా ఉండ‌గా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైందని చెప్పారు. దాంతో తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విపరీతంగా విరిగిపడుతున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధ్వంసమైన రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నామని వివరించారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన వీడియోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement