Saturday, December 7, 2024

కొత్త సెక్రటేరియ‌ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. అన్ని ప‌నులు కంప్లీట్ చేయాల‌ని సీఎం ఆదేశాలు

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టి నిర్మాణం పూర్తి చేసిన నూత‌న సెక్ర‌టేరియ‌ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. స‌మీకృత కొత్త స‌చివాల‌యం ప్రారంభానికి సంబంధించి తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే.. ఆ తేదీలోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందాయి. కాగా, వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18న కొత్త సెక్ర‌టేరియ‌ట్ ప్రారంభించ‌నున్న‌ట్టు సీఎం కేసీఆర్ నుంచి స‌మాచారం అందుతోంది.

అదే రోజు నుంచి ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు అక్క‌డి నుంచే కొన‌సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఘ‌నంగా కొత్త స‌చివాల‌యం ప్రారంభాన్ని నిర్వ‌హించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు అందాయి. ముందుగా 6వ అంతస్తులోని సీఎం బ్లాకు ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement