Friday, March 29, 2024

భ‌క్తి తెచ్చిన ముప్పు.. ఏనుగు విగ్ర‌హం కింద ఇరుక్కుపోయిన భ‌క్తుడు

భ‌క్తి పేరుతో చిత్ర విచిత్ర‌మైన విన్యాసాలు చేయ‌డం స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంద‌ని నిరూపించాడో ఓ భ‌క్తుడు.దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. సదరు వీడియోలో ఓ వ్యక్తి ఏనుగు విగ్రహం కింద నుంచి దూరే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ వ్యక్తి పట్టేంత స్థలం ఏనుగు విగ్రహం కింద లేదు. అయినా కానీ, ఆ వ్యక్తి ధైర్యం చేసి అటు నుంచి ఇటు వచ్చే ప్రయత్నం చేశాడు.

కానీ, దాని కింద ఇరుక్కుపోయి ముందుకు రాలేక, వెనక్కి పోలేక దేవుడా అంటూ ఆర్తనాదాలు చేశాడు. ఈ ఆలయం ఎక్కడన్నది వీడియోలో లేదు. మరి చివరికి ఆ వ్యక్తి ఏనుగు విగ్రహం కింద నుంచి బయటపడ్డాడా లేదా అన్నది కూడా తెలియదు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. భక్తి ఎక్కువైనా ముప్పేనంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. నిజమే భక్తికి కూడా ఓ అర్థం ఉండాలి కదా. ఓ వ్యక్తి అయితే, ఈ వీడియో మధ్యప్రదేశ్ లోని అమరకాంతక్ నర్మదా మందిర్ కు సంబంధించినదిగా కామెంట్ రూపంలో తెలిపారు.

https://twitter.com/nkk_123/status/1599457906419986432
Advertisement

తాజా వార్తలు

Advertisement