Thursday, April 25, 2024

బీజింగ్ లో వేల‌ల్లో క‌రోనా కేసులు.. స్ట్రెచ‌ర్ల‌పైనే చికిత్స‌

బీజింగ్ లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది. వేల‌ల్లో కొత్తగా క‌రోనా కేసులు వ‌స్తున్నాయి. దాంతో హాస్ప‌ట‌ల్స్ లో బెడ్స్ ఖాళీ ఉండ‌టం లేదు. దాంతో కరోనా పాజిటివ్ రోగుల్లో ఆక్సిజన్ అవసరమైన వారికి స్ట్రెచర్లపైనే చికిత్స అందిస్తున్నారు. బీజింగ్ లోని చుయాంగ్లియు ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ స్ట్రెచర్లపై ఆక్సిజన్ అమర్చిన కరోనా రోగులు దర్శనమిస్తున్నారు. కొందరిని వీల్ చెయిర్లలో కూర్చోబెట్టి చికిత్స చేస్తున్నారు. చాలా ఆసుపత్రులు వెల్లువలా వస్తున్న కరోనా రోగులకు బెడ్లు ఏర్పాటు చేయలేక చేతులెత్తేశాయి.

అటు, శ్మశానాలు సైతం వరుసగా వస్తున్న మృతదేహాలతో రద్దీగా మారాయి. కాగా, చైనా తీరు పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర అసంతృప్తితో ఉంది. తాజాగా కరోనా ఉద్ధృతిపై చైనా వెల్లడిస్తున్న గణాంకాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా లేవని స్పష్టం చేసింది. చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాచి విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లూ జీరో కొవిడ్ పాలసీకి కట్టుబడి కఠిన లాక్ డౌన్ విధించిన చైనా, ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ప్రబలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement